తెలుగు భావనలు – వ్యాకరణం | Telugu Grammer

తెలుగు భావనలు

  తెలుగు భావనలు – వ్యాకరణం  

 

వ్యాకరణ సంగ్రహం 

మన మనస్సు లోని భావాలను , అనుభూతులను పైకి చెప్పడానికి  మాతృభాష ఎంతో ఉపయోగం , అందుకే మాతృ భాష తల్లి లాంటిది అంటారు. మనం మన మాతృ భాషని గౌరవించాలి .

గ్రహణ సామర్థ్యం పెరగడానికి మాతృ భాష  లో విద్యా బోధన ఎంతగానో ఉపయోగ పడుతుంది.  మాతృ భాష లో బోధించడం వలన విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది.

మన మాతృ భాష  తెలుగు . తెలుగు భాష పట్ల అంకిత భావం కలిగి ఉండాలి .

వర్ణమాల

 

భాషా ధ్వనులకు అక్షరపు గుర్తులను ‘ వర్ణమాల’ లేదా ‘ అక్షరామాల’ అని అంటారు.

అ   ఆ   ఇ   ఈ   ఉ   ఊ   ఋ   ౠ 

ఎ   ఏ   ఐ   ఓ   ఔ   అం   ఆః

క    ఖ     గ    ఘ     ఙ 

చ   ఛ    జ   ఝ    ఞ

ట   ఠ    డ   ఢ    ణ

త   థ    ద   ధ   న 

ప   ఫ   బ   భ    మ

య   ర    ల    వ

శ   ష   స   హ   ళ   క్ష   ఱ

అక్షరాలను మూడు రకాలుగా విభజించారు. అవి: 1. అచ్చులు.  2. హల్లులు 3. ఉభయాక్షరాలు

 

1. అచ్చులు:

 

ఆచ్చులు మొత్తం 14 అక్షరాలు. అవి :

అచ్చులకు ‘ప్రాణములు’ మరియు ‘ స్వరములు’ అనే పేర్లు ఉన్నాయి.

 

2. హల్లులు:

హల్లులు మొత్తం 35 అక్షరాలు. అవి :

హల్లులకు ‘వ్యంజనములు ‘ మరియు ‘ప్రాణులు’ అనే పేర్లున్నాయి.

తెలుగు భావనలు

3. ఉభయాక్షరాలు : ఈ అక్షరాలను అచ్చులలోను,హల్లులలోను కూడా ఉపయోగిస్తారు.

    ఇవి మూడు :1. ఁ  2. ం   3. ః

వచనాలు:

 

వచనాలు రెండు రకాలు అవి: 1. ఏక వచనం 2. బహువచనం

1, ఏకవచనం: – ఒకే వస్తువును తెలియజేసే దానిని ఏకవచనం అంటారు .

ఉదా : – బాలుడు , బాలిక , చెట్టు, మొదలగునవి.

2. బహువచనం : – ఒకటికంటే ఎక్కువ వస్తువులను తెలియజేసే దానిని బహువచనం అంటారు.

ఉదా : – బాలురు  , బాలికలు  , చెట్లు , మొదలగునవి.

 

గుణింతాలు :

తెలుగు గుణింతాలు

 

భాషా భాగాలు

 

భాషకు ప్రాణం భావ ప్రసరణ . ఈ భావ ప్రసరణ ఒకరి నుండి మరొకరికి చేరాలి . ఇలా చేరడానికి కొన్ని పదాలు వాక్యాలు అవసరం. కొన్ని అక్షరాలతో పదాలు ఏర్పడతాయి, కొన్ని పదాలతో  వాక్యాలు ఏర్పడతాయి. పదాలు కొన్ని భాగాలుగా విభజించ బడ్డాయి. ఈ భాగాలనే ‘భాషాభాగాలు’ అంటారు. ఇవి ఐదు రకాలు అవి : 1) నామవాచకం 2) సర్వనామం 3) విశేషణం  4) క్రియ  5) అవ్యయం .

1.నామవాచకం: పేర్లను తెలియజేసే నామవాచకాలు అంటారు.

ఉదా: – రాముడు, సీత, చిలుక , బల్ల మొ∥ నవి.  

2.సర్వనామాలు : నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు 

ఉదా: – అతడు, ఆమె , అది , ఇది   మొ∥ నవి.  

3.విశేషణం : నామ వాచకం యొక్క కానీ , సర్వనామం ఒక్క కానీ గుణాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటారు.

ఉదా: – ఎర్రగా , పెద్దగా , తెర్లగా  , మంచి    మొ∥ నవి.  

ఆ పాలు వేడిగా ఉన్నాయి

4.క్రియ: పనులను స్థితిగతులను తెలియజేసే ది క్రియ  

ఉదా: – వెళ్తున్నారు,వస్తున్నాడు , పాడుతున్నాడు    మొ∥ నవి.  

5.అవ్యయం :  లింగ, వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలను వ్యయాలు అంటారు.

 ఉదా: అక్కడ, ఇక్కడ, ఆహ     మొ∥ నవి.  

మరిన్ని విషయాలకు ఇక్కడ నొక్కండి  

 


Visit my YouTube channel: Click on the Logo

AS_Tutorioal_Png

 

 

Scroll to Top