Telugu Grammer( తెలుగు వ్యాకరణం )

Telugu Grammer( తెలుగు వ్యాకరణం )

Telugu Grammer( తెలుగు వ్యాకరణం )

Telugu Grammer( తెలుగు వ్యాకరణం ): మన మనస్సు లోని భావాలను , అనుభూతులను పైకి చెప్పడానికి  మాతృభాష ఎంతో ఉపయోగం , అందుకే మాతృ భాష తల్లి లాంటిది అంటారు. మనం మన మాతృ భాషని గౌరవించాలి .

గ్రహణ సామర్థ్యం పెరగడానికి మాతృ భాష  లో విద్యా బోధన ఎంతగానో ఉపయోగ పడుతుంది.  మాతృ భాష లో బోధించడం వలన విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది.


భాషా భాగాలు :

భాషకు ప్రాణం భావ ప్రసరణ . ఈ భావ ప్రసరణ ఒకరి నుండి మరొకరికి చేరాలి . ఇలా చేరడానికి కొన్ని పదాలు వాక్యాలు అవసరం. ఇలా వాక్యం లోని ఉపయోగాన్ని బట్టి భాషకు ఐదు ప్రధాన భాగాలుగా విభజించారు.

అవి :− 1. నామవాచకం   2. సర్వనామం  3. విశేషణం  4. క్రియ  5. అవ్యయము

1.నామవాచకం :

నామము అనగా పేరు.ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని ,గుణమును గాని, జాతిని గాని తెలుపును.

ఉదా :- ధర్మరాజు , హైదరాబాద్ , బంతిపువ్వు , ఆవు మొ|| నవి .

2. సర్వనామము :

నామ వాచకాలకు బదులుగా వాడే వాటిని “ సర్వనామాలు “ అంటారు. “సర్వ” అనగా సమస్తము.

ఉదా :- అది, ఇది, అతడు , ఆమె ,అన్ని ,కొన్ని మొ|| నవి.

3.  విశేషణం  :

నామవాచకము మరియు సర్వనామముల యొక్క గుణమును తెలియజేయునది .

ఉదా :- మంచి , చెడు , లావు , పొట్టి , పొడుగు  , ఎత్తు  మొ|| నవి.

4. క్రియ :

పనులను, స్తితిగతులను తెలియజేయునది .

ఉదా :- రాస్తున్నాడు , వెళ్తున్నాడు , పాడుతున్నాడు  మొ|| నవి.

5. అవ్యయము :

వ్యయము అనగా నశించేది, అవయము అనగా నశించనిది .

లింగ, వచన, విభక్తుల ప్రసక్తిగాని, వచన ఆకాంక్ష లేని వాటిని అవ్యయములు అంటారు .

ఉదా :-  అక్కడ, ఇక్కడ, ఆహా , భళా  మొ|| నవి.

సంధులు 

వ్యాకరణ భాషలో రెండు  స్వరాల కలయికను  సంధి  అంటారు .

రెండు అచ్చుల మధ్య  జరిగే మార్పును  సంధి కార్యం  అంటారు.

సంధి జరిగే మొదటి పదo చివరి అక్షరం లోని అచ్చును ‘పూర్వ పదం’ అంటారు .

సంధి జరిగే రెండవ పదం మొదటి అక్షరం లోని అచ్చును ‘పర పదం ‘ అంటారు .

ఉదా :- రామ + అయ్యా:  ‘ రామ’  లోని     ‘మ’  లో  ‘అ’ పూర్వ పదం  ‘అయ్యా’  లోని  ‘అ ‘ పర పదం .

అత్వ సంధి(అకార సంధి ):

అత్తునకు సంధి  బహుళంగా వస్తుంది .

ఉదా :-1) మేఅల్లుడు = మేన + అల్లుడు         

           2) లేకేమి  = లేక + ఏమి

           3) రాకుంటే  = రాక + ఉంటే                 

         4) పోవుటెట్లు =  పోవుట  + ఎట్లు

ఇత్వ సంధి ( ఇకార సంధి):

ఏమ్యాదులకు ఇత్తునకు సంధి .

ఉదా :- 1) ఏమంటివి = ఏమి + అంటివి                                      2) పైకెత్తినారు  = పైకి + ఎత్తినారు

             3) వచ్చిరిపుడు  = వచ్చిరి + ఇపుడు          

              4) మనిషన్నవాడు  = మనిషి + అన్నవాడు

ఉత్వ సంధి ( ఉకార సంధి ):

ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది .

ఉదా :- 1) రాముడతడు = రాముడు + అతడు   

           2) మనమున్నాము = మనము + ఉన్నాము

            3) అతడెక్కడ = అతడు + ఎక్కడ                    

              4) మనసైన = మనసు + ఐన 

యదగామ సంధి :

అంది లేని చోట అచ్చుల మద్య ‘య్’ వచ్చి  చేరడాన్ని “యడాగమం” అంటారు .

ఉదా :- 1) మాయమ్మ = మా + అమ్మ                                          2) హరియతడు = హరి + అతడు

              3) మాయిల్లు = మా + ఇల్లు

ఆమ్రేడిత సంధి :

అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది .

ఉదా :- 1)  ఆహాహా = ఆహా +ఆహా                                              2)  ఔరౌర = ఔర  + ఔర

             3) అరెరే = అరె + అరె                                

             4)  ఏమిటేమిటి = ఏమిటి + ఏమిటి

గసడదవాదేశ సంధి :

ప్రథమ మీది పరుషాలకు గ, స ,డ , ద ,వ   లు  బహుళంగా వస్తాయి .

ఉదా :-  1)  కొలువుసేసి = కొలువు + చేసి   

             2) కూరగాయలు = కూర + కాయ

              3) పాలువోయక = ఆలు + పోయక        

              4) తల్లిదండ్రులు  = తల్లి + తండ్రి

త్రిక సంధి :

త్రికము మీది అసంయుక్త హల్లునకు దిత్వం బహుళంగా వస్తుంది .

ఆ , ఈ , ఏ  లు త్రికంఅనబడుతాయి

ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు, అచ్చికమైన దీర్ఘానికి  హ్రస్వం వస్తుంది.

ఉదా :-  1)  ఇక్కాలము  = ఈ + కాలము         

             2)  అక్కోమరుండు =  ఆ + కొమరుండు

             3) ఎవ్వాడు = ఏ + వాడు                     

             4) అచ్చోట = ఆ + చోట

రుగాగమ సంధి :

పేదాది శబ్దాలకు  ‘ఆల‘ శబ్దo పరమైతే కర్మదారాయం లో రుగాగం వస్తుంది .

ఉదా :- 1) మనుమరాలు = మనుమా + ఆలు                             2) ధీరురాలు  = దీరు + ఆలు.                                         3) పేదరాలు = పేద + ఆలు                                             4)  బాలెంతరాలు = బాలెంత + ఆలు                               5 ) ముద్దరాలు = ముద్ద +ఆలు                                       6) జవరాలు = జావా + ఆలు

  సవర్ణ దీర్ఘ  సంధి:

అ, ఇ , ఉ,  ఋ లకు అవే అచ్చులు పరమైతే వాని దీర్గాలు ఎకాదేశంగా వస్తాయి .

ఉదా :-    1)  రామానుజుడు = రామ + అనుజుడు                           2 )  రామాలయం = రామ + ఆలయం.                             3)  భానూఉదయం  = భాను + ఉదయం                         4)  కవీంద్రుడు = కవి + ఇంద్రుడు.                                    5 ) పితౄణం = పితృ +ఋణం                                        6) వదూపేతుడు  = వధు + ఉపేతుడు

 గుణసంధి :

ఇ , ఉ , ఋ  పరమైతే ఏ, ఓ , ఆర్  లు క్రమంగా ఎకాదేసంగా వస్తాయి .

ఉదా :-    1)  రాజేంద్రుడు  = రాజ  + ఇంద్రుడు                                2 )  పరోపకారం  = పర  + ఉపకారం                                3)  రాజర్షి   = రాజ  + ఋషి                                          4)   మహోన్నతి = మహా  + ఉన్నతి

యణాదేశ సంధి:

ఇ , ఉ, ఋ లకు అసవర్ణ అచ్చులు పరమైతే య , వ ,ర  లు వస్తాయి .

ఉదా :-    1)  అత్యవసరం  = అతి  + అవసరం                              2)  ప్రత్యేకం  = ప్రతి  + ఏకం.                                          3)  అణ్వస్త్రం   = అణు  + అస్త్రం                                       4)  పిత్రార్జితం  = పితృ  + ఆర్జితం                                    5 ) పితౄణం = పితృ +ఋణం

 వృద్ధి సంధి :

అకారినికి ఏ , ఐ  లు పరమైతే ‘ఐ ‘ కారము , ఓ , ఔ లు పరమైతే  ‘ఔ’ కారము వస్తాయి.

ఉదా :-    1)  వసుధైక  = వసుధ   + ఏక                                        2)  సమైక్యం   = సమ   + ఐక్యం                                      3)  వనౌసది    = వన   + ఔసది                                      4)  పిత్రార్జితం  = పితృ  + ఆర్జితం

 అనునాసిక సంధి : 

వర్గ ప్రతమాక్షరాలకు ‘న’ గాని , ‘మ’ గాని ప్రమైతే అనునాసికాలు. 

ఉదా :-    1)  వాజ్మయం   = వాక్   + మయం                                  2)  జగన్నాథుడు   = జగత్  + నాథుడు                            3)  అణ్వస్త్రం   = అణు  + అస్త్రం                                      4)  పిత్రార్జితం  = పితృ  + ఆర్జితం                                    5) తన్మయం  = తత్  + మయం

 సమాసాలు 

సమాసం : వేరు వేరు అర్థాలు కల రెండు పదాలు కలిసి , ఏకంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు .

దంద్వ సమాసం:

రెండు కాని,  అంతకంటే ఎక్కువ కాని నామవాచకాల మద్య ఏర్పడే సమాసాన్ని ‘దంద్వ సమాసం ‘ అంటారు.

ఉదా : – 1) అన్నదమ్ములు  – అన్న, తమ్ముడు                                2) తల్లిదడ్రులు – తల్లి, తండ్రి                                          3) మంచిచెడులు – మంచి, చెడు                                    4 ) కష్టసుఖాలు – కష్ట , సుఖము

ద్విగు సామాసం :

సమాసంలో మొదటి పదంలో సంఖ్య గల సమాసాన్ని ‘ద్విగు’ సమాసం అంటారు.

ఉదా : – 1) నవరసాలు   – నవ సంఖ్య  గల రసాలు                        2) రెండుజడలు  – రెండు సంఖ్య  గల జడలు                  3) నాలుగు వేదాలు – సంఖ్య గల వేదాలు

 తత్పురుష సమాసం :

విభక్తి ప్రత్యాలు విగ్రహ వాక్యంలో ఉపయోగించే సమాసాలు ‘ తత్పురుష  సమాసాలు .

విభక్తులు

  • ఒక వాక్యం లోని వేరు వేరు పదాలకు అన్వయం కలిగించు పదాలను “ విభక్తులు” అంటారు
విభక్తులుప్రత్యయాలు
ప్రథమా విభక్తిడు – ము – వు – లు
ద్వితీయ విభక్తినిన్ – నన్ – లన్ – కూర్చి – గురించి
తృతీయ విభక్తిచేతన్ – చెన్ –  తోడన్ – తోన్
చతుర్థి విభక్తికొరకున్  – కై
పంచమ విభక్తివలనన్ – కంటెన్ – పట్టి
షష్ఠివిభక్తియొక్క – లోన్ – లోపలన్
సప్తమి విభక్తిఅందున్ – నన్
సంబోధన ప్రథమా  విభక్తిఓరి – ఓయి – ఓసి
  
సమాస పదంవిగ్రహ వాక్యంసమాసం పేరు
మద్యాహ్నముఅహ్నం యొక్క మద్యప్రథమా తత్పురుష
జటాధారిజడలను ధరించినవాడుద్వితీయ  తత్పురుష
రాజ పూజితుడురాజు చే పూజితుడుతృతీయ  తత్పురుష
       వంట కట్టెలువంట కొరకు కట్టెలుచతుర్థి  తత్పురుష
              అగ్నిభయం                     అగ్ని వల్ల భయంపంచమ  తత్పురుష
భుజభలంభుజాల యొక్క భలంషష్ఠి తత్పురుష
పుర జనులుపురమునందు  జనులుసప్తమి తత్పురుష

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం : విశేషణం పూర్వపదంగా (మొదటి) ఉండే సమాసం .

ఉదా : – తెల్ల గుర్రం – తెల్లదైన  గుర్రం,  ఇస్టార్థములు – ఇష్టమైన అర్థములు

సంభావన  పూర్వపద కర్మధారయ సమాసం :  సమాసం లోని పూర్వపడం సంజ్ఞావాచాకంగా , ఉత్తరపదం జాతి వాచకంగా ఉంటుంది .

 

ఉదా :- కాశిక పట్టణం – కాశిక అను పేరు గల పట్టణం, తెలంగాణా రాష్ట్రము – తెలంగాణ అను పేరు గల రాష్ట్రం

నైతత్పురుష సమాసం :  వ్యతిరేఖ పదాన్ని ఇచ్చే పదం .

ఉదా :- అసత్యం – సత్యం కానిది , నిరాదారం – ఆదారం కానిది , అనుచితం – ఉచితం కానుది .

Telugu Grammer( తెలుగు వ్యాకరణం )


Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab



అలంకారాలు
  

అలంకారం : చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.

అంత్యాను ప్రాస అలంకారం:  ఒకే అక్షరం లేదా రెండు , మూడు అక్షరాలు వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని  అంత్యాను ప్రాస అలంకారం అంటారు .

ఉదా : – భాగవతమున భక్తి – భారతమున యుక్తి – రామ కథయే రక్తి  ఓ కూనలమ్మ .

వృత్యానుప్రాస అలంకారం: ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హల్లులు పలుమార్లు వచ్చునట్లు చెబితే  వృత్యానుప్రాస అవితుంది.

ఉదా : – వీరు పొమ్మను వారు  వారు పోగబెట్టు వారు

కాకి కోకికాదు దా

చేకానుప్రాస అలంకారం: అర్థ భేదం తో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే చేక్కనుప్రాస అనబడుతుంది .

ఉదా : – అ నాథ నాథ  నంద నంద న నీకు వందనం

నీకు వంద వందనాలు.

లాటాను ప్రాస అలంకారం : అర్థంలో భేధం లేకపోయినా , తాత్పర్యంలో భేదం ఉండేటట్లు , ఒక పదం రెండు సార్లు ప్రయోగించబడితే లాతానుప్రాస అనబడుతుంది.

ఉదా : – కమలాక్షునకు అర్పించు కరములు కరములు

యమకం : అచ్చులలో హల్లులలో మార్పు లేనట్టి అక్షరాల సమూహం అర్థ భేదంతో మళ్ళీ  ప్రయోగిన్చినట్లయితే యమకం అనబడుతుంది.

ఉదా : –  పురము నందు నంతిపురము 

ముక్త పద గ్రస్తo : విడిచి పెట్టబడ్డ పద భాగాలను వ్యవదానం లేకుండా వెంటనే ప్రయోగించి చెబితే ముక్త ప్రదగ్రస్తం .

ఉదా :- సుదతీ సూదన మదనా

మదనా గ తురంగ పూర్ణ మణి మాయ సదనా

సదనా మయ గజ రాదనా .

ఉపమాలంకారం : ఉపమేయానికి ఉపమానం తో చక్కని పోలిక వర్ణించబడిన యెడల ఉపమాన అలంకారం అనబడుతుంది .

ఉదా : – 1) చేనేత కార్మికులు ఎలుకల్ల మాడి పోతున్నారు    2) నీ కీర్తి హంష  లాగ ఆకాశ గంగలో మునుగుతుంది

రూపకాలoకారం : ఉపమానానినికి , ఉపమేయానినికి భేదం లేనట్లు వర్ణించి చెబితే రూపకాలoకారం అంటారు.

ఉదా : – 1) సంసార సాగరాన్ని తరించడం మిక్కిలి కష్టం   2 ) మౌనికి తేనె పలుకులు అందరికి ఇష్టమే

ఉత్ప్రేక్ష అలంకారం : ఉపమానానినికి ఉన్న ధర్మాలు  ఉపమేయంలో ఉండడం చేత , ఉపమేయాన్ని  ఉపమానo గా ఊహించి చెబితే  ఉత్ప్రేక్ష  అలంకారం అంటారు.

ఉదా : –  1) ఆ మేడలు ఆకాశాన్ని  ముద్దడుతున్నాయా అన్నట్లు ఉన్నాయి    2) ఈ వెన్నెల పాలవెళ్లి యో  అన్నట్లుంది .

అతి శయోక్తి అలంకారం : ఒక వస్తువు గురించి కాని సందర్భాన్ని గురించి కాని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెబితే అతి శయోక్తి అంటారు.

ఉదా : – మా నగరం లోని మేడలు ఆకాశాన్ని అంటుతున్నాయి

శ్లేషాలo కారం : అనేకమైన అర్థాలు కల శబ్దాలను ఉపయోగించి చెబితే శ్లేష అనబడుతుంది

ఉదా : – రాజు కువలయానంద  కరుడు

రాజు = ప్రభువు , చంద్రుడు       కువలయం = భూమి , కలువ పూలు

స్వభావోక్తి అలంకారం :  జాతి గుణం క్రియాదు లలో ఉన్నది ఉన్నట్లు చెప్పడం

ఉదా : – చెట్ల ఆకులు గాలికి కదులుతున్నాయి

ఛందస్సు

పద్య లక్షణాన్ని తెలిపే శాస్త్రాన్ని ఛందస్ శాస్త్రం అంటారు .

ఒక మాత్ర కాలం లో ఉచ్చరించబడేది లఘువు (I )

రెండు మాత్రల  కాలం లో ఉచ్చరించబడేది  గురువు ( U  )

తెలుగు ఛందస్సు

             య  గణం   IUU                                            జ  గణం    IUI

                                 మ  గణం  UUU                                           భ  గణం    UII

 త   గణం   UUI                                             న  గణం III

   ర   గణం    UIU                                              స  గణం  IIU

 

పద్యం పేరుగణాలుయతి స్తానంఅక్షరాల సంఖ్య
ఉత్పల మాలభ, ర, న, భ, భ, ర, వ1020
చంపక మాలన, జ, భ, జ, జ, జ, ర1121
శార్దూలంమ, స, జ, స, త, త, గ1319
మత్తేభంస, భ, ర, న, మ, య, వ1420

వాఖ్య నిర్మాణము – రకాలు 

వాక్యాలు మూడు రకాలు : 1 ) సామాన్య వాక్యము 2) సంశ్లిష్ట వాక్యము       3) సంయుక్త వాక్యము .

  • సామాన్య వాక్యము :- క్రియ ఉన్నా  లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు .

ఉదా : (i ) సీత బజారుకు వెళ్ళింది .    (ii) పాము కాటేసింది   (iii ) మురళి మంచి బాలుడు

  • సంశ్లిష్ట వాక్యము:- ఒక సమాపక క్రియ , ఒకటి గాని అంతకన్నా ఎక్కువ గాని అసామాపక క్రియలు ఉంటే  ఆ వాక్యాన్ని    సంశ్లిష్ట వాక్యము అంటారు .

ఉదా :- (i )  రాము అన్నము తిని , పడుకున్నాడు         (ii )  సీత బజారుకు వెళ్లి , సరుకులు కొన్నది

  • సంయుక్త వాక్యము:- సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాo ను సంయుక్త వాక్యము అంటారు.

ఉదా :-  (i ) అతడు నటుడు, రచయిత    (ii ) రాము మరియు సిత హైదరాబాద్ వెళ్లారు    (iii ) సీత చదువుతుంది ,

కర్తరి – కర్మణి వాఖ్యాలు 

  • కర్తరి వాక్యము :- ఒక వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఇచ్చి , కర్మకు ద్వితీయ విభక్తి (నిన్ , నున్ , లన్ , కూర్చి , గురించి ) చేరితే ఆ వాక్యాని కర్తరి వాక్యం అంటారు.
  • కర్మణి వాక్యము :-  ఒక వాక్యంలో క్రియకు ధాతువు చేరి  , కర్మకు తృతీయ  విభక్తి  ( చేతస్ , చేన్ , తోన్ , తోడన్ ) చేరితే ఆ వాక్యాని కర్తరి వాక్యం అంటారు.

ఉదా :-

 కర్తరి వాక్యముకర్మణి  వాక్యము
1 ప్రజలు శాంతిని కోరుతున్నారుప్రజలచే శాంతి కోరబడుతుంది
2మేం పెద్దలను గౌరవిస్తాముమాచే పెద్దలు గౌరవించ బడతారు
3రాజు రైలును నడిపాడురైలు రాజు చే నడపబడింది
4భీముడు కొండలను పిండి చేసాడుకొండలు భీముని చే పిండి చేయబడెను
5నా మీద రాళ్ళు విసురుతారునా మీద రాళ్ళు విసరబడతాయి

ప్రత్యక్ష – పరోక్ష కథనాలు 
ప్రతక్ష కథనం : ఒకరు చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం . ఒకరు చెప్పిన విషయం  “     “  చిహ్నాల మద్య ఉందును.

ఉదా:-   i )  “ నేను రస జీవిని “  అని చాసో అన్నాడు    (ii ) అంబేత్కర్  “  నేను ఎవరిని యాచిన్చను  “ అని అన్నాడు

  • పరోక్ష కథనం :  ఒకరు చెప్పిన విషయాన్ని మన మాటల్లో చెప్పడం .    ఇందులో   “    “  చిహ్నాలు ఉండవు .

ఉదా:-  (i )  తాను రస  జీవినని చాసో అన్నాడు    (ii ) అబ్మేత్కర్ తాను ఎవరినీ  యాచిన్చనని  అన్నాడు

గమనిక : ప్రత్యక్ష కథనం  నుండి పరోక్షం లోకి మార్చునప్పుడు  జరుగు మార్పులు :

ప్రత్యక్షంపరోక్షం
నేనుతాను
ఆయనఅతను, వాడు
అదిఇది
నాకుతనకు
నాతన
నన్నుతనను
మేముతాము
మాకుతమకు
ఇదిఅది

 


Visit my Youtube Channel: Click on Below Logo

AS_Tutorioal_Png

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top